అవయువ దానం చేస్తామని ప్రమాణం చేసిన ప్రముఖుల సరసన నటుడు నవదీప్ కుడా చేరాడు. గతంలో ఎస్. ఎస్ . రాజమౌళి, నాగార్జున, అమల అక్కినేని , లక్ష్మి మంచు , అరవింద్ కృష్ణ , హర్షవర్ధన్ రానే వంటి ప్రముఖులు అవయువ దానం చేస్తామని ప్రమాణం చేసారు. నవదీప్ అవయువ దానం పై చైతన్యం తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్న మోహన్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం లో ఒక అతిధి గా పాల్గొన్నాడు . ” చాలా అద్భుతమైన మానవత విలువల్ని, జాలిని మోహన్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం లో చూసాను ! విజయవంతమైన అవయువ దాన సంస్థ !! నేను అవయువ దానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను . ఆధార్ కార్డు లాగ డోనార్ కార్డు కూడా కంపల్సరీ చెయ్యాలి . మనవల్ల ఇంకొకరికి కొత్త జీవితం వస్తుంది!” అని నవదీప్ తన ఆ కార్యక్రమానికి వెళ్ళిన వెంటనే ట్విట్టర్ ఖాతా లో పేర్కొన్నాడు .
ఇంతేకాకుండా నవదీప్ ఈ మధ్యన చాలా పని తో బిజీ గా వున్నాడు . ఇటివలే ‘బాద్ షా ‘లో కనపడిన నవదీప్ తన తరువాతి మూడు చిత్రాలు ‘పొగ’, ‘వసూల్ రాజ’, ‘బంగారు కోడిపెట్ట ‘ వేసవిలో విడుదల కానున్నాయి . ఈ చిత్రాలే కాకుండా త్వరలో ప్రారంభం కానున్న మరో మూడు చిత్రాల్లో నటించనున్నాడు . చూస్తుంటే నవదీప్ ఈ ఏడాదంతా చాలా బిజీ అయ్యేలా వున్నాడు .