యంగ్ హీరో నవదీప్, సదా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘మైత్రి’. ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో పగటి పూట అందరితో సరదాగా ఉండే సదా రాత్రి పూట అందరినీ భయపెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా తనలో అనుకోని మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేదే ఈ చిత్ర కథాంశం. హను సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సూర్య రాజు దర్శకత్వం వహించారు. వికాస్ సంగీతమా అందించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శీను మరియు సత్యం రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నవదీప్ ఈ సినిమా కాకుండా ‘వసూల్ రాజా’, ‘బంగారు కోడిపెట్ట’ మరియు ‘పొగ’ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే ఎన్.టి.ఆర్ హీరోగా రానున్న ‘బాద్షా’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో చాలా కాలంగా సరైన హిట్ లేక డీలా పడిన సదాకి ఈ సినిమాతో నవదీప్ అన్నా హిట్ ఇస్తాడేమో చూడాలి.
నవంబర్ చివర్లో రానున్న నవదీప్ మైత్రి
నవంబర్ చివర్లో రానున్న నవదీప్ మైత్రి
Published on Nov 21, 2012 11:00 PM IST
సంబంధిత సమాచారం
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’