నరేష్ ‘యముడికి మొగుడు’ సెన్సార్ రేపే

నరేష్ ‘యముడికి మొగుడు’ సెన్సార్ రేపే

Published on Dec 18, 2012 11:44 AM IST

Allari-Naresh-Yamudiki-Mogu
కామెడీ కింగ్ అల్లరి నరేష్ యముడికి మొగుడు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ తదితర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. రేపు సెన్సార్ సభ్యుల ముందుకి ఈ చిత్రాన్ని తీసుకు వెళ్లనున్నారు. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కి జోడీగా రిచా పనాయ్ నటించింది. షాయాజీ షిండే యముడి పాత్రలో నటించగా ఆయన భార్యగా రమ్యకృష్ణ నటించింది. కామెడీ చిత్రాల దర్శకుడు ఈ. సత్తిబాబు డైరెక్ట్ చేస్తున్న యముడికి మొగుడు సినిమాని ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై చంటి అడ్డాల నిర్మిస్తున్నారు. కోటి సంగీతం అందిస్తున్న ఈ సినిమా సారొచ్చారు, గజరాజు సినిమాలతో పాటుగా ఈ వరం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు