బుచ్చిబాబుగా అలరించనున్న అల్లరోడు

బుచ్చిబాబుగా అలరించనున్న అల్లరోడు

Published on Jul 16, 2013 12:30 PM IST

Kevvu-Keka

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన ‘కెవ్వు కేక’ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని సమాచారం. ఈ సినిమాలో నరేష్ బుచ్చిబాబు గా కనిపించనున్నాడు. దేవి ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ నటన అతని ఫాన్స్ అందరికి బాగా నచ్చుతుందని ఆయన అన్నారు. ‘ఈ సినిమాలో సందర్బాను సారంగా వచ్చే కామెడీ చాలా బాగుంటుంది. అశీష్ విద్యార్ధి ఈ సినిమాలో సూపర్బ్ పాత్రలో నటించాడు. తను నటించిన కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయి’ అని దేవి ప్రసాద్ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అన్నాడు. బొప్పన చంద్ర శేఖర్ నిర్మించిన ఈ సినిమాలో షర్మిల మండ్రే హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు