అన్నపూర్ణ స్టూడియోస్ లో నారా రోహిత్ సినిమా షూటింగ్

nara-rohit
యంగ్ హీరో నారా రోహిత్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ రేపు ఉదయం 6 గంటల వరకూ జరగనుంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం మొత్తం ప్రస్తుతం సెట్స్ లో ఉంది. యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కార్తికేయ డైరెక్టర్. నీలం, కృతిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సున్నీ రాజు నిర్మాత.

ఇది కాకుండా నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది.

Exit mobile version