‘సోలో’ సినిమాతో తొలి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న హీరో నారా రోహిత్ మరియు నూతన దర్శకుడు విజయ్ లింగమనేని దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘మద్రాసి’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో ఈ చిత్రానికి సంభందించిన ముహూర్త కార్యక్రమాలు జరుపుకొంది. మొదటి షాట్ కి బెల్లం కొండ సురేష్ క్లాప్ ఇచ్చారు. ‘ప్రస్థానం’ లాంటి సినిమా తీసిన నిర్మాత రవి వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
నారా రోహిత్ మరియు నిత్యా మీనన్ లు జంటగా నటిస్తున్న’ఒక్కడినే’ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.