ఆనంద్ రవి దర్శకత్వంలో నారా రోహిత్

ఆనంద్ రవి దర్శకత్వంలో నారా రోహిత్

Published on Jan 25, 2014 9:00 PM IST

nara_rohith
నారా రోహిత్ వరుసపెట్టి సినిమాలు చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం రౌడీ ఫెల్లో అంటూ లేకపోతే కార్తికేయ దర్శకత్వంలో క సినిమా అంటూ షూటింగ్ లలో పాల్గుంటున్న మన హీరో ఇప్పుడు రచయితనుండి దర్శకుడిగా మారిన ఆనంద్ రవికి అవకాశం ఇవ్వనున్నాడు

రోహిత్ నటిస్తున్న ప్రతినిధి సినిమాకు ఆనంద్ రవినే స్క్రిప్ట్ అందించాడు. ప్రశాంత్ మాండవ దర్శకుడు. ఆనంద్ రవి తీసే సినిమాకు పేరెంట్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ యేడాది నుండి ఈ స్క్రిప్ట్ ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమానే కాక నారా రోహిత్ కొన్ని సినిమాలను నిర్మిస్తున్నాడు. కాబట్టి ఈ యేడాది నారా రోహిత్ కు బిజీగా సాగనుంది

తాజా వార్తలు