‘లవర్’ గా రాబోతున్న నారా రోహిత్

‘లవర్’ గా రాబోతున్న నారా రోహిత్

Published on Jan 11, 2013 1:50 PM IST

nara-rohit-and-monali-gajja
నారా రోహిత్ త్వరలో కార్తికేయ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంలో కనిపించనున్నారు. శ్రీ శైలేంద్ర మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “లవర్” అనే పేరుని ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన రైల్వే స్టేషన్ సెట్లో జరుగుతుంది. ప్రకాష్ పర్యవేక్షణలో ఒక ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన మోనాల్ గజ్జర్ నటించనుంది. గతంలో “1920” హిందీ చిత్రంలో నటించిన అదా శర్మ ఈ చిత్రంతో తెలుగులోకి పరిచయం అవుతున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉండగా నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన “ఒక్కడినే” మరియు “మద్రాసి” ఈ ఏడాది విడుదల కానున్నాయి.

తాజా వార్తలు