నారా రోహిత్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. తను నటించిన ‘ప్రతినిధి’ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది. ప్రస్తుతం నారా రోహిత్ రెండు ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు తను మొదట్లో నటించిన రెండు సినిమాలు ‘బాణం’ , ‘సోలో’ పోలిచుకుంటే డిఫరెంట్ గా ఉంటుందని తెలియజేశారు.ఈ రెండు ప్రాజెక్ట్ లలో మొదటిదాని టైటిల్ ‘రౌడీ ఫెలో’. పాటల రచయిత చైతన్య కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. విశాఖ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ స్టైలిష్ గా ఒక కొత్త అవతారంలో కనిపించనున్నాడు.
మరొక టైటిల్ పెట్టని సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నాడు. నీలం ఉపాధ్యాయ, లక్ష్మీ కృతిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ డిసెంబర్ మూడవ వారం నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోందని సమాచారం