భారీ ధరకు ‘ది ప్యారడైజ్’ ఆడియో హక్కులు!

భారీ ధరకు ‘ది ప్యారడైజ్’ ఆడియో హక్కులు!

Published on May 15, 2025 7:03 AM IST

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా హిట్ తో తన విజయాల పరంపర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి రాబోతున్న మరో అవైటెడ్ సినిమానే “ది ప్యారడైజ్”. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఫైనల్ గా ఈ సినిమా రికార్డ్ బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇలా ది ప్యారడైజ్ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. సరిగమ మ్యూజిక్ లేబుల్ వారు ఏకంగా 18 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారట. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అన్నీ కలిపి మరోసారి నాని సినిమా సినీ వర్గాల్లో వైరల్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు