నాని – సమంత సినిమాకి అమెరికాలో ఆదరణ

నాని – సమంత సినిమాకి అమెరికాలో ఆదరణ

Published on Dec 17, 2012 1:31 PM IST

yvm
యంగ్ హీరో నాని – అందాల ముద్దుగుమ్మ సమంత జంటగా నటించిన రొమాంటిక్ సినిమా ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా యు.ఎస్.ఎ లో మంచి లాభాన్ని తెచ్చిపెడుతోంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లో 200,000 యు.ఎస్ డాలర్లు కలెక్ట్ చేసింది. నాని, సమంత, గౌతం మీనన్ కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉండడం వల్ల ఇంత కలెక్ట్ చెయ్యగలిగింది. ఆంధ్ర ప్రదేశ్లో ఈ సినిమా ఎ సెంటర్లలో బాగా ఆడుతోంది, బి,సి సెంటర్లలో అంతంత మాత్రంగా ఉంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాని తెలుగులో సి కళ్యాన్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు