“ఈగ” చిత్రం భారీ విజయం సాదించిన తరువాత నాని మేఘాలలో తేలిపోతున్నారు. ఈ చిత్రంలో తనది చిన్న పాత్రే అయినా తన నటనతో తెలుగు మరియు తమిళంలో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మధ్యనే మొదలయిన విజయ యాత్రకి వస్తున్న భారీ జనాన్ని చుసిన నాని ఆశ్చర్యానికి లోనయ్యారు.ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ “ప్రేక్షకులు “ఈగ” చిత్రంలో స్టార్ లేరు అంటున్నారు నేను ఒప్పుకోను “ఈగ” చిత్రంలో కూడా ఒక సూపర్ స్టార్ ఉన్నారు మరెవరో కాదు ఎస్ ఎస్ రాజమౌళి” అని అన్నారు. ఈ చిత్రం తరువాత ఆయన త్వరలో గౌతం మీనన్ “ఎటో వెళ్లిపోయింది మనసు” మరియు కృష్ణ వంశీ “పైసా” చిత్రాలలో కనిపించనున్నారు.