నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నాని కెరీర్లోనే రికార్డు ఓపెనింగ్స్ ని అందుకోగా లాంగ్ రన్ లో కూడా మంచి రన్ ని అందుకుంది. ఇలా థియేటర్స్ లో అదరగొట్టిన ఈ చిత్రం ఇపుడు ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
ఈ చిత్రం ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో హిట్ 3 ఈ మే 29 నుంచి వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు డేట్ ని ఇచ్చేసారు. సో హిట్ 3 కోసం చూస్తున్న వారు మరికొన్ని రోజులు ఎదురు చూస్తే సరిపోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా అడివి శేష్, కార్తీలు సాలిడ్ క్యామియో పాత్రల్లో నటించారు.