HIT 3: ఈ మార్కెట్ లో బ్రేకీవెన్ పూర్తి.. ఇక అన్నీ లాభాలే!

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్లోనే సాలిడ్ హిట్ గా నిలిచింది. రికార్డు ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకోవడమే కాకుండా నాని కెరీర్లో ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్ గా కూడా నిలిచింది.

ఇక ఈ చిత్రం లేటెస్ట్ గా ఓవర్సీస్ మార్కెట్ లో మొత్తం బ్రేకీవెన్ కొట్టేసినట్టుగా ఇపుడు పీఆర్ లెక్కలు చెబుతున్నాయి. యూఎస్ సహా ఇతర కొన్ని దేశాల్లో మొత్తం 2.4 మిలియన్ డాలర్స్ టార్గెట్ తో రిలీజ్ కి వచ్చిన హిట్ 3 ఇపుడు ఈ మొత్తాన్ని దాటేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ 2.6 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం ఇక నుంచి సినిమాని కొన్నవారు అందరికీ లాభాలే అందించనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అడివి శేష్, కార్తీలు క్యామియో పాత్రల్లో కనిపించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

Exit mobile version