నాని కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్లలో ‘భలే భలే మగాడివోయ్’ కూడా ఒకటి. ఈ సినిమాతో నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు భావించారు. మారుతి, నానిలు కూడా మరొసారి కలిసి వర్క్ చేయాలని చాలాసార్లే అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. అయితే త్వరలో వీరి కాంబినేషన్ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయి.
కాగా తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు వీరి ప్రాజెక్ట్ కు సంబందించి స్క్రిప్ట్ ఫైనల్ అయిన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మించే వీలుంటుందట. మరి ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే అఫీషియల్ క్కన్ఫర్మేషన్ అందేవరకు ఆగాల్సిందే. ఇకపోతే ‘వి’ చిత్రం తో నాని నిరాశ పరిచాడు. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇక మారుతి విషయానికొస్తే ఇటీవలే ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఆయన ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏదీ అనౌన్స్ చేయలేదు.