నాని – కృష్ణ వంశీ నిర్మాతలుగా ఓ సినిమా.!

నాని – కృష్ణ వంశీ నిర్మాతలుగా ఓ సినిమా.!

Published on Feb 10, 2014 11:15 PM IST

Krishna-Vamsi-and-Nani
యంగ్ హీరో నాని ఈ మధ్య నిర్మాతగా కూడా సినిమాలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ‘డీ ఫర్ దోపిడీ’ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించాడు. ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన ‘పన్నాయిరుమ్ పద్మినియుమ్’ సినిమా రీమేక్ రైట్స్ కూడా నాని కొనుగోలు చేసాడు.

ఇది కాకుండా కృష్ణవంశీతో కలిసి ఓ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంపై కృష్ణవంశీ మాట్లాడుతూ ‘ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా పూర్తయ్యాక నానితో ఓ కాంటెంపరారీ సినిమా చేయాలనుకుంటున్నాను. ఆ సినిమాని నేను, నాని కలిసి నిర్మిస్తామని’ అన్నాడు. నాని – కృష్ణవంశీ కాంబినేషన్ లో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పైసా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.

తాజా వార్తలు