నంది అవార్డ్స్ లో దూకుడు చూపిన “దూకుడు”

నంది అవార్డ్స్ లో దూకుడు చూపిన “దూకుడు”

Published on Oct 13, 2012 4:00 PM IST

2011 సంవత్సరంలో విడుదలయిన చిత్రాలకు గాను తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రతిష్టాత్మకమయిన అవార్డ్స్ నంది అవార్డ్స్ ని ఈరోజు ప్రకటించారు.ఈ అవార్డ్స్లో మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన “దూకుడు” అత్యధిక అవార్డ్లను గెలుచుకోగా తరువాతి స్థానంలో “శ్రీ రామ రాజ్యం”,”రాజన్న” మరియు “జై బోలో తెలంగాణ”లు నిలిచాయి. ఉత్తమ హీరోగా “దూకుడు” చిత్రానికి గాను మహేష్ బాబు మూడవసారి అవార్డుని అందుకోనుండగా ఉత్తమ చిత్రంగా “శ్రీ రామ రాజ్యం” ఎంపికయ్యింది.

మీకోసం 2011 నంది అవార్డ్స్ పూర్తి లిస్టు

1.ఉత్తమ చిత్రం – శ్రీ రామ రాజ్యం

రెండవ ఉత్తమ చిత్రం – రాజన్న

మూడవ ఉత్తమ చిత్రం – విరోధి

2. ఉత్తమ దర్శకుడు – ఎం శంకర్ (జై బోలో తెలంగాణ)

3. ఉత్తమ నటుడు – మహేష్ బాబు (దూకుడు)

4. ఉత్తమ నటి – నయనతార(శ్రీ రామరాజ్యం)

5. ఉత్తమ సహాయ నటుడు – ప్రకాష్ రాజ్ (దూకుడు)

6. ఉత్తమ సహాయ నటి – సుజాత రెడ్డి (ఇంకెన్నాళ్ళు)

7. ఉత్తమ క్యారెక్టర్ అర్తిస్ – గాంధీ (రాజన్న)

8. ఉన్నత హాస్యనటుడు – ఎం ఎస్ నారాయణ (దూకుడు)

9. ఉత్తమ హాస్య నటి – రత్నసాగర్ (కారాలు మిరియాలు)

10. ఉత్తమ విలన్ – లక్ష్మి మంచు (అనగనగా ఓ ధీరుడు)

11 ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రాజు(శ్రీ రామరాజ్యం)

12. ఉత్తమ సంగీత దర్శకుడు – ఇళయరాజా (శ్రీ రామరాజ్యం)

13. ఉత్తమ ఎడిటర్ – ఎం ఆర్ వర్మ (దూకుడు)

14 ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – ఎస్ రవీందర్ (రాజన్న)

15 ఉత్తమ స్క్రీన్ప్లే – శ్రీను వైట్ల (దూకుడు)

16 . ఉత్తమ కథ రచయిత – రాజ్ మాదిరాజు (రుషి)

17 ఉత్తమ డైలాగ్స్ – నీలకంఠ(విరోధి)

18 ఉత్తమ గేయ రచయిత – మడేపల్లి సురేందర్ (జై బోలో తెలంగాణ)

19 ఉత్తమ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం – 100% లవ్

20 ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం – దూకుడు

21 ఉత్తమ బాలల చిత్రం – శిఖరం

రెండవ ఉత్తమ బాలల చిత్రం – గంటల బండి

22. బాలల చిత్రానికి ఉత్తమ దర్శకుడు – కైలాష్

23. ఉత్తమ డాకుమెంటరీ – అవయువ దానం

రెండవ ఉత్తమ దాసుమేన్తరి – మన భాద్యత

24. ఉత్తమ ఫిలిం క్రిటిక్ – రెంటాల జయదేవ్

25. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రం – జై బోలో తెలంగాణ

26. ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ – గద్దర్ (జై బోలో తెలంగాణ)

27. ఉత్తమ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ – మాళవిక (రాజన్న)

28. ఉత్తమ బాలనటుడు – మాస్టర్ నిఖిల్ (100% లవ్)

29. ఉత్తమ బాల నటి – బేబీ అన్ని (రాజన్న)

30. ఉత్తమ పరిచయ డైరెక్టర్ – భాను ప్రకాష్ (ప్రయోగం)

31. ఉత్తమ కొరియోగ్రాఫర్ – శ్రీను (శ్రీ రామరాజ్యం)

32. ఉత్తమ అడియోగ్రఫర్ – కే దేవి కృష్ణ (బద్రీనాథ్)

33. ఉత్తమ కాస్ట్యుం డిజైనర్ – నిఖిల్ ధావన్ ,భాష (అనగనగా ఓ ధీరుడు)

34. ఉత్తమ మేకప్ – పి రాంబాబు

35. ఉత్తమ స్టంట్స్ – విజయ్(దూకుడు)

36. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – ఫణి ఎగ్గోనే (అనగనగా ఓ ధీరుడు)

37. ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ – ఆర్ సి ఎం రాజు (జై బోలో తెలంగాణ)

38. ఉత్తమ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ – సునీత (శ్రీ రామరాజ్యం)

స్పెషల్ జురి అవార్డ్స్ – నాగార్జున (రాజన్న), ఛార్మి(మంగళ), రమేష్ ప్రసాద్ (ఋషి)

తాజా వార్తలు