నేడే టాలీవుడ్ నంది అవార్డ్స్ వేడుక

నేడే టాలీవుడ్ నంది అవార్డ్స్ వేడుక

Published on Apr 11, 2013 9:00 AM IST

Nandi-Awards
2011కు సంబందించిన నంది అవార్డుల కార్యక్రమం ఈ రోజు సాయంత్రం ఘనంగా జరగనుంది. ఈ వేడుక హైదరాబాద్లోని లలితకళా తోరణంలో సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకకి చాలా మంది స్టార్స్ వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ వేడుకకి నంది అవార్డ్స్ గెలుగుకునే విన్నర్స్ కాకుండా ఇండస్ట్రీలోని ప్రముఖులు, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి డికె అరుణ, గీతా రెడ్డి, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్, అలాగే హైదరాబాద్ మేయర్ మొహమ్మద్ మజిద్ హుస్సేన్ లు హాజరు కానున్నారు.
నంది అవార్డ్స్ గెలుగు కున్న విన్నర్స్ కి మరొక సారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

2011 నంది అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ …

1. బెస్ట్ మూవీ – శ్రీ రామరాజ్యం
సెకండ్ బెస్ట్ మూవీ – రాజన్న
థర్డ్ బెస్ట్ మూవీ – విరోధి

2. బెస్ట్ డైరెక్టర్ – ఎన్. శంకర్ (జై బోలో తెలంగాణ)
3. ఉత్తమ నటుడు – మహేష్ బాబు (దూకుడు)
4. ఉత్తమ నటి – నయనతార (శ్రీ రామరాజ్యం)
5. ఉత్తమ సహాయ నటుడు – ప్రకాష్ రాజ్ (దూకుడు)
6. ఉత్తమ సహాయ నటి – సుజాత రెడ్డి (ఇంకెన్నాళ్ళు)
7. ఉత్తమ క్యారెక్టర్ నటుడు – గాంధీ (రాజన్న)
8. ఉత్తమ హాస్య నటుడు – ఎం.ఎస్ నారాయణ (దూకుడు)
9. ఉత్తమ హాస్య నటి – రత్నసాగర్ (కారాలు మిరియాలు)
10. బెస్ట్ విలన్ – లక్ష్మీ మంచు (అనగనగా ఓ ధీరుడు)
11. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – రాజు (శ్రీ రామ రాజ్యం)
12. ఉత్తమ సంగీత దర్శకుడు – ఇళయరాజా (శ్రీ రామ రాజ్యం)
13. బెస్ట్ ఎడిటర్ – ఎం.ఆర్ వర్మ (దూకుడు)
14. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – ఎస్ రవీందర్ (రాజన్న)
15. బెస్ట్ స్క్రీన్ ప్లే – శ్రీను వైట్ల (దూకుడు)
16. బెస్ట్ స్టొరీ రైటర్ – రాజ్ మాదిరాజు (ఋషి)
17. బెస్ట్ డైలాగ్స్ – నీలకంఠ (విరోధి)
18. బెస్ట్ లిరిసిస్ట్ – మాదేపల్లి సురేందర్ (జై బోలో తెలంగాణ)
19. బెస్ట్ హోం (ఫీచర్ ఫిల్మ్) – 100% లవ్
20. బెస్ట్ పాపులర్ సినిమా (విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ) – దూకుడు
21. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ – శిఖరం
సెకండ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్- గంటల బండి
22. చిల్డ్రన్స్ ఫిల్మ్ బెస్ట్ డైరెక్టర్ – కైలాష్
23. బెస్ట్ డాక్యుమెంటరీ – అవయవ దానం
సేకంగ్ బెస్ట్ డాక్యుమెంటరీ – మన భాద్యత
24. బెస్ట్ మూవీ విమర్శకుడు – రెంటల జయ రెడ్డి
25. జాతీయ సమైక్యత మీద బెస్ట్ ఫిల్మ్ – జై బోలో తెలంగాణ
26. బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – గద్దర్ (జై బోలో తెలంగాణ)
27. బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ – మాళవిక (రాజన్న)
28. బెస్ట్ చైల్డ్ నటుడు – మాస్టర్ నిఖిల్ (100% లవ్)
29. బెస్ట్ చైల్డ్ నటి – బేబీ అన్నీ (రాజన్న)
30. ఉత్తమ మొదటి సినిమా డైరెక్టర్ – భాను ప్రకాష్ (ప్రయోగం)
31. బెస్ట్ కొరియోగ్రాఫర్ – శ్రీను (శ్రీ రామ రాజ్యం)
32. బెస్ట్ ఆడియో గ్రాఫర్ – కె. దేవీ కృష్ణ (బద్రినాథ్)
33. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – నిఖిల్ దవన్, బాష(అనగనగా ఓ ధీరుడు)
34. బెస్ట్ మేకప్ – పి. రాంబాబు (శ్రీ రామ్ రాజ్యం)
35. బెస్ట్ స్టంట్స్ – విజయ్ (దూకుడు)
36. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – ఫణి (అనగనగా ఓ ధీరుడు)
37. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ (మేల్) – ఆర్.సి.ఎం రాజు(జై బోలో తెలంగాణ)
38. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ (ఫీమేల్) – సునీత (శ్రీ రామ రాజ్యం)
39. సినిమాల్లో బెస్ట్ లిటరేచర్ (బుక్స్, పోస్టర్స్, మొదలైనవి) – ఈశ్వర్

స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ –
నాగార్జున (రాజన్న)
ఛార్మి (మంగళ)
రమేష్ ప్రసాద్ (ఋషి)

తాజా వార్తలు