లేడీ ఎమ్మెల్యేగా కనిపించబోతున్న నమిత !

నందమూరి నట సింహం బాలయ్య బాబు ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే వచ్చేవారంతో ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం చేస్తోన్న యాక్షన్ షెడ్యూల్ పూర్తి అవుతుందట. ఇక ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలయ్య సరసన పూర్ణ అండ్ అలాగే మరో కొత్త హీరోయిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే పూర్ణ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమిత కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అట. ముఖ్యంగా సినిమాలో ఆమె రాజకీయ నాయకురాలు అయినా.. లేడీ విలన్ గా కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. కాగా ఈ సినిమా కోసం ముఖ్యంగా సినిమాలోని తన రెండు గెటప్ ల్లో కనిపించడానికి.. ఈ వయసులో కూడా బాలయ్య బాగా కష్టపడుతున్నాడట. మొత్తానికి బాలయ్య మళ్లీ పవర్ ఫుల్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈ సినిమా బాలయ్యకు ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

Exit mobile version