కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటున్న శిరిడి సాయి


అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’ చిత్రం ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెల 25 వరకు బాదామి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తుండగా సాయికృప ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై ఎ. మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గడ్డంతో కనిపించడానికి నాగార్జున ఆయన ఆహార పద్ధతులు మరియు లైఫ్ స్టైల్ మార్చుకున్నారు. నాగార్జున గతంలో ‘అన్నమయ్య’ మరియు ‘శ్రీ రామదాసు’ వంటి రెండు భక్తిరస చిత్రాలు తీసి విజయవంతమయ్యారు. ఆ రెండు చిత్రాలను కూడా రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయడం విశేషం. వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు నాగార్జున అభిమానుల్లో కూడా అంచనాలున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version