తాను తెరకెక్కిస్తున్న ‘కొచ్చాడయాన్’ సినిమా టీజర్ సృష్టించిన ప్రభంజనంతో సౌందర్య రజనీకాంత్ చాలా ఆనందంగా వుంది. ఆమె ఆనందానికి మరో కారణంకూడా వుందంట. చనిపోయిన కమేడియన్ నగేష్ తెరపై మరోసారి తన అభిమానులు చూడనున్నారు
అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నగేష్ పాత్రకు జీవం పోశారు. అంతేకాక ఈ సినిమాలో అతని పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. నగేష్ రజినికాంత్ కు ఆప్తుడు. అందుకోసమే ఈ సినిమాలో అతనిపాత్రని పెట్టి సౌందర్య ఆయనపై ఉన్న ఇష్టాన్ని తెలిపింది.
ఈ పరిజ్ఞానంపై ఆమెకు నమ్మకం ఉందని కూడా తెలిపింది. చనిపోయిన వారిని తెరపై చూపించి విజయం సాధిస్తే ఇలాంటి పాత్రలు భవిష్యత్తులో మరిన్ని వచ్చే అవకాశాలు వున్నాయి