‘సంతోషం’ సినిమాతో విజయాన్ని అందుకున్న హీరో కింగ్ అక్కినేని నాగార్జున – డైరెక్టర్ దశరథ్ కాంబినేషన్లో మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ లవ్ స్టొరీతో మనముందుకు రానున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున ఈవెంట్ మేనేజర్ గా కనిపించనున్నాడు. ఒక ముఖ్యమైన పని వల్ల ఇండియాకి వస్తాడు, పీడియాట్రిషిన్ అయిన నయనతారతో తన పని పూర్తి చేస్తాడు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 12 రోజుల టాకీ పార్ట్, ఒక సాంగ్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యింది.
ఈ సినిమా చివరి షెడ్యూల్ జనవరి 21 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 6కి ముగియనుంది. నాగార్జున, నయనతారతో పాటు మీరా చోప్రా కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాటైటిల్ ని త్వరలోనే ప్రకటించనున్నారు, అలాగే మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.