నాగార్జున వాన పాటకి అల్లరి నరేష్ స్టెప్పులు

Allari-NAresh
కామెడీ హీరో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘యాక్షన్ 3డి’. ఈ సినిమాలో కింగ్ నాగార్జున నటించిన ‘ప్రేమ యుద్ధం’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘స్వాతి ముత్యపు జల్లులలో’ని రీమిక్స్ చేసారు. ఈ పాటని నరేష్, నీలం ఉపాధ్యాయ్ లపై తెరకెక్కించారు. గాయత్రీ రఘురాం కొరియోగ్రఫీ చేసిన ఈ పాట ఈ సినిమాకే హైలైట్ అవుతుందని సినీ నిర్వాహకులు చెబుతున్నారు. భారీ బడ్జెట్ నిర్మిస్తున్న ఈ ‘యాక్షన్ 3డి’ సినిమా సమ్మర్ ఎంటర్టైనర్ గా మే లో విడుదల చేయనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బప్పి లహరి, బప్పా లహిరి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని ఇంటర్నేషనల్ టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు

Exit mobile version