బ్యాంకాక్ వెళ్లనున్న నాగ్ – నయనతార

బ్యాంకాక్ వెళ్లనున్న నాగ్ – నయనతార

Published on Dec 2, 2012 8:42 PM IST

నాగార్జున, నయనతార త్వరలో బ్యాంకాక్ వెళ్లనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బృందం ఇటీవలే యూరోప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్ళబోతుంది. ఈ షెడ్యూల్ 25 రోజులు ఉండబోతుంది. ఈ షెడ్యూల్లో చాలా వరకు షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నయనతారతో పాటుగా మరో తార మీరా చోప్రా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. నాగార్జున చిరకాల మిత్రుడు డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గతంలో ఈయన నాగార్జునతో రగడ, కేడి, కింగ్, బాస్, నేనున్నాను, ఎదురు లేని మనిషి వంటి చాలా సినిమాలు నిర్మించాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మర్చిలో విడుదల చేస్తారని సమాచారం.

తాజా వార్తలు