బ్యాంకాక్లో నాగార్జున లవ్ స్టొరీ

బ్యాంకాక్లో నాగార్జున లవ్ స్టొరీ

Published on Dec 20, 2012 8:37 AM IST

nagarjuna-nayantara-love-st
కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టొరీ’ వర్కింగ్ టైటిల్ గా అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రొటీన్ లవ్ స్టొరీ అనే సినిమా రావడంతో ఈ సినిమాకి లవ్ స్టొరీ అనే టైటిల్ పెట్టకూడదు అని చిత్ర బృందం భావించారు. ఆ టైటిల్ స్థానంలో చంద్రుడు, ప్రేమికుడు అనే టైటిల్స్ అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టైటిల్ ఖరారు చేసిన తరువాత అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకి రానుంది. గతంలో నాగార్జున ‘సంతోషం’ అనే సినిమాకి డైరెక్ట్ చేసిన దశరద్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నాగార్జున ఆస్థాన నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జునకి జోడీగా నయనతార ఈ సినిమాలో నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు