‘మనం’ లో నాగార్జున లుక్ కి లభిస్తున్న మంచి స్పందన

‘మనం’ లో నాగార్జున లుక్ కి లభిస్తున్న మంచి స్పందన

Published on Mar 9, 2014 9:02 PM IST

Nagarjuna-Exclusive-Still-F

నాగార్జున తాజా చిత్రం ‘మనం’ వచ్చే నెలలో విడుదల కు సిద్ధం కానుంది. విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ఎ. యెన్. ఆర్, నాగ చైతన్య, శ్రియ శరన్, సమంతా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.
ఇటివలే ‘మనం’ చిత్రం లోని నాగార్జున ఫోటోలు కొన్ని ఫేస్ బుక్ lసందడి చేసాయి. నాగార్జున ఒక ప్రొఫెషనల్ అవతారం లో కనపడగ దానికి మంచి స్పందన లభించింది. కొంత మంది ఈ లుక్ ని ‘మన్మధుడు’ చిత్రం లోని లుక్ తో పోలుస్తూ నాగార్జున ఇప్పటికి టాలీవుడ్ లోని అందమైన నటులలో ఒకడని చర్చించుకున్నారు. ‘మనం’ చిత్రం కధాంశం వెల్లడి కాలేదు. కాని ఈ చిత్రం లో నాగార్జున తో పాటు ఎ. యెన్. ఆర్, నాగ చైతన్య కనిపిస్తుండడం తో విక్రం కుమార్ ఈ చిత్రాన్ని ఎలా చిత్రీకరించారో చూడడానికి అందరు ఉవ్విలడుతున్నారు.
అనుప్ రుబెన్స్ అందిస్తున్న ఈ చిత్రానికి పి. ఎస్. వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ ఫీల్ గుడ్ చిత్రానికి రాజీవన్ ఆర్ట్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రానికి సహా నిర్మాత గా వ్యవహరిస్తుంది.

తాజా వార్తలు