ఇండస్ట్రీ నుంచి ప్రశంసలందుకుంటున్న నాగ్

ఇండస్ట్రీ నుంచి ప్రశంసలందుకుంటున్న నాగ్

Published on Sep 7, 2012 9:24 AM IST


‘శిరిడి సాయి’ చిత్రంలో షిర్డీ సాయి గా చేసిన అక్కినేని నాగార్జున నటనకి నలుమూల నుండి మంచి స్పందన లబిస్తోంది మరియు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నాగార్జున గారి పాత్రకి ఇండస్ట్రీ నుంచి కూడా అద్భుతమైన స్పందన వినిపిస్తోంది.

సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఎస్. ఎస్ రాజమౌళి కూడా ఈ చిత్రంపై తన ట్విట్టర్లో స్పందించారు, అలాగే చాలామంది సీనియర్ నిర్మాతలు మరియు దర్శకులు నాగార్జున గారి నటన గురించే పొగుడుతున్నారు. అందరూ ముఖ్త కంఠంతో అంటున్న మాట ఏమిటంటే ‘ ఒక రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరోకి భక్తి సంభందమైన పాత్రలు చేయడం చాలా కష్టమైనది కానీ అలాంటి అరుదైన ఇమేజ్ ని నాగార్జున సొంతం చేసుకున్నారని’ అంటున్నారు. ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ తో నడుస్తోంది మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూడటానికి భారీగా థియేటర్లకు వస్తున్నారు. ఈ చిత్రం నాగార్జున కెరీర్లో ఒక మైలురాయి గా నిలిచిపోతుంది.

ఈ చిత్రాన్ని దర్శకేంద్రుకు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో స్వరవాణి ఎం.ఎం కీరవాణి సంగీత సారధ్యంలో ఎ. మహేష్ రెడ్డి నిర్మించారు.

తాజా వార్తలు