విడుదలైన భాయ్ టీజర్

విడుదలైన భాయ్ టీజర్

Published on Aug 16, 2013 8:36 PM IST

nagarjuna-in-bhai
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచే రీతిలో వుంది. ఈ టీజర్లో నాగార్జున చాలా స్టైలిష్ గా కనబడటమే కాకుండా మనం ఊహించిన భాయ్ బులెట్స్(డైలాగ్స్)ను సైతం పొందుపరిచారు

రీచా గంగోపాధ్యాయ్ ఈ సినిమాలో హీరోయిన్. దేవి అందించిన టైటిల్ ట్రాక్ విన్న వెంటనే ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ అతని నుంచి ఒక మంచి ఆల్బంను ఆశిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున మూడు విభిన్న పాత్రలలో కనిపిస్తారు

రిలయాన్స్ అసోసియేషన్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ మొదటి వారంలో, సినిమాను సెప్టెంబర్ మధ్యలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు

తాజా వార్తలు