కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కూడా ఒకటి. ఒకవిధంగా ఈ డికేడ్ లో నాగ్ కెరీర్ లోనే ఈ సినిమా ముఖ్యమైంది. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో నాగార్జున చేసిన ‘బంగార్రాజు’ పాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కలయికలో ఆ సినిమానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది.
కాగా ఏప్రిల్ రెండో వారంలో సినిమాను మొదలుపెట్టి, దసరాకి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్ లో బిజీగా ఉన్నాడట. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. మరి నాగ్ ఈ సారి హిట్ కొడతారా చూడలి. అయితే నాగ్ గత సినిమా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన `మన్మథుడు 2′ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ చిత్రంగా నిలిచింది. దాంతో బంగార్రాజు పై మరింత కేర్ తీసుకుంటున్నారు.