సోషల్ మీడియా కింగ్ అనిపించిన నాగార్జున..!


కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. కాగా నాగార్జున ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కును దాటింది. ఈ సందర్భంగా నాగార్జున తన ట్విట్టర్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.

సీనియర్ హీరోలలో నాగ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ అదిరిపోయిందని చెప్పాలి. ఇక నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఎన్ ఐ ఏ అధికారి పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సాల్మాన్ వహిస్తుండగా, నెక్స్ట్ షెడ్యూల్ థాయిలాండ్ లో ప్లాన్ చేశారని తెలుస్తుంది.

Exit mobile version