‘ది రాజా సాబ్’ లో ఈ అంశంపై ఇంట్రెస్టింగ్ క్లారిటీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న హారర్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి రీసెంట్ గానే వచ్చిన టీజర్ సాలిడ్ రెస్పాన్స్ అందుకోగా ఇపుడు ఫ్యాన్స్ మరింత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

అయితే ది రాజా సాబ్ లో ప్రభాస్ పై ఆ మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఉన్నాయి. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్ వచ్చింది. అలాగే తనపై రెండు లుక్ పోస్టర్స్ చూసి కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా సినిమా టీజర్ చూసాక ప్రభాస్ సింగిల్ రోల్ మాత్రమే అని తెలుస్తుంది. మరి ఆ ఓల్డ్ ఏజ్ గెటప్ లుక్ ఏంటంటే ప్రభాస్ తాత ఆత్మ ఆవహించినపుడు తనని ఆ రోల్ లో చూపిస్తారని చెప్పొచ్చు. సో ప్రభాస్ డ్యూయల్ రోల్ అనేది అవాస్తవం అని చెప్పొచ్చు.

Exit mobile version