పూరి ఫాంటసీ స్టోరీలో నాగార్జున ?

పూరి ఫాంటసీ స్టోరీలో నాగార్జున ?

Published on Oct 11, 2020 1:28 AM IST


డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కింగ్ నాగార్జున కలయికలో ఓ సినిమా రాబోతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ లో పూరి నాగ్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. ఈ కరోనా ఖాళీ సమయం తనకు తాజాగా ఆలోచించడానికి అలాగే భిన్నమైన కథలను వ్రాయడానికి అద్భుతమైన అవకాశం అని పూరి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు. చెప్పినట్లుగానే పూరి మొదటిసారి ఓ ఫాంటసీ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది. చారిత్రాత్మకకు చెందిన ఓ రాజు.. పొరపాటున ఈ భూమి మీదకు వస్తే.. అతను తన రాజరికాన్ని చూపించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది మెయిన్ లైన్ అట.

కాగా సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా కాస్త వ్యంగ్యంగానే సినిమా నడుస్తోందని తెలుస్తోంది. ఇక నాగ్ – పూరి కలయికలో వచ్చిన శివమణి (2003) మరియు సూపర్ (2005) సినిమాలతో తమది క్రేజీ కాంబినేషన్ అనిపించుకున్నారు. అయితే వీరిద్దరూ మళ్ళీ త్వరలో మరో సినిమా చేయబోతుండటం అక్కినేని అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూసే ఇది. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాగ్ తో సినిమా మొదలుపెడతాడట. ‘శివ మణి’, ‘సూపర్’ సినిమాల రేంజ్ లోనే నాగ్ కు మళ్లీ పూరి, ఆ రేంజ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.

తాజా వార్తలు