రేపటి నుండి భాయ్ సాంగ్ ప్యాచ్ వర్క్

రేపటి నుండి భాయ్ సాంగ్ ప్యాచ్ వర్క్

Published on Feb 10, 2013 4:40 PM IST

Nagarjuna-and-Nathaliya-Kau

నాగార్జున నటిస్తున్న “భాయి” చిత్రం రేపు ఫిబ్రవరి 11న అన్నపూర్ణ స్టుడియోలో జరగనుంది. ఈ సినిమా షూటింగ్ గత నెల రోజులుగా బ్యాంకాక్ లో జరిగింది. ఈ సినిమాలో నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్ మరియు సోనుసూద్ లు నటిస్తున్నారు. ఈ సినిమాలో బ్రెజిలియన్ మోడల్ నతాలియా కౌర్ ఐటమ్ సాంగ్లో నర్తించింది. ఈ పాటను గత నెలలో బ్యాంకాక్ లో తీశారు. బాలన్స్ ప్యాచ్ వర్క్ జనవరి చివరి వారంలో పూర్తిచేయాలి. కానీ నాగార్జున దశరథ్ దర్శకత్వం వహిస్తున్న “గ్రీకు వీరుడు ” సినిమా చివరి దశ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కావున ఇప్పుడు “భాయి ” సినిమాలోని మిగిలిన పాటను నాగార్జున, నతలియా కౌర్ ఫై రేపటి నుండి అన్నపూర్ణ స్టుడియోలో చిత్రీకరిస్తారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ ఫై నాగార్జున నిర్మిస్తున్నారు. దీనికి వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు