పూర్తికావచ్చిన నాగార్జున చిత్రం

పూర్తికావచ్చిన నాగార్జున చిత్రం

Published on Jul 10, 2013 11:15 PM IST

nag-bhai-itemsong
నాగార్జున తాజా చిత్రం ‘భాయ్’ సినిమా ముగింపుదశకు చేరుకుంది. ఈ సినిమా చాలా భాగం ఇప్పటికే పూర్తయింది. మాకందిన సమాచారం ప్రకారం త్వరలో ఈ చిత్రం చివరి షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ పరిసరలాలో నాగార్జున సోనూ సూద్ మధ్య తియ్యనున్నారు. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్. తమిళ నటి ప్రసన్న కూడా ఈ చిత్రంలో నటిస్తుంది. వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్న రీతిలో తెరకెక్కుతుందని సమాచారం.ఇప్పటివరకూ ‘అహ నా పెళ్ళంట’, ‘పూలరంగడు’ వంటి కామెడీ సినిమాలను తీసిన వీరభద్రమ్ ‘భాయ్’ లో తన మార్కు కామెడీతో పాటు నాగార్జున మార్కు మాస్ టచ్ ను కూడా అందించనున్నాడు. ఈ సినిమా పేరు ‘భాయ్’ అయినపట్టికీ మాఫియా నేపధ్యంలో సాగే సినిమా కాదని నాగార్జున ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు

తాజా వార్తలు