‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ఆపివేసిన నాగార్జున

ప్రమాదకర కొరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూ ప్రపంచం మొత్తాని భయపెడుతున్న నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్థం అవుతుంది. ముఖ్యంగా వరల్డ్ వైడ్ గా చిత్ర పరిశ్రమ కుదేలవుతుంది. కొత్త సినిమాల విడుదల మరియు షూటింగ్ షెడ్యూల్స్ ఆగిపోయాయి. కాగా నాగార్జున నూతన చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ కూడా ఆపివేసినట్టు తెలుస్తుంది.

కింగ్ నాగార్జున హీరోగా తెరక్కుతున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్. అశుతోష్ సోలొమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మరియు ఎన్ ఐ ఏ అధికారి విజయ్ వర్మ అనే రోల్ చేస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ రెండు వారాలు ఆపేయాలని నాగార్జున నిర్ణయించారట. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version