నాగార్జున – మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ?

nagarjuna-and-mahesh-babu

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ సంచలనాత్మక వార్త చక్కర్లు కొడుతోంది. విషయం ఏమిటంటే అక్కినేని నాగార్జున – మహేష్ బాబు కలిసి త్వరలో ఓ సినిమా చేయనున్నారు. అలాగే ఈ సినిమాకి సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ అయిన మణిరత్నం దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.

ఇప్పటి వరకూ ఈ సినిమా విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయం గురించి మేము ఆరాతీస్తే చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని ఇంకా ఎలాంటి కార్యరూపం దాల్చలేదని తెలిపారు. అలాగే మణిరత్నం కూడా ఈ సినిమాలో మరికొంతమంది తమిళ స్టార్స్ ఉండేలా ట్రై చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి సంబంచిన వివరాలను ఎప్పటికపుడు పోస్ట్ చేస్తుంటాం.

Exit mobile version