నాగ శౌర్య సినిమాలో కథానాయకిగా పాపులర్ పాప్ సింగర్

నాగ శౌర్య సినిమాలో కథానాయకిగా పాపులర్ పాప్ సింగర్

Published on Nov 21, 2020 10:45 AM IST

యంగ్ హీరో నాగ శౌర్య పలు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అనులో తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో చేయనున్న సినిమా కూడ ఒకటుంది. ఈ చిత్రాన్ని ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రంలో కథానాయకిగా షిర్లీ సేతియాను ఎంపిక చేశారు. షిర్లీ సేతియా మామూలు అమ్మాయి కాదు ప్రముఖ పాప్ సింగర్. ఆక్లాండ్ కు చెందిన ఈమె నటి కూడ.

నెట్‌ఫ్లిక్స్ నందు వచ్చిన ‘మ‌స్కా’తో న‌టిగా మారిన‌ షిర్లీ సేతియా త్వ‌ర‌లో శిల్పా శెట్టి, అభిమ‌న్యు ద‌స్సాని కలయికలో వస్తున్న ‘నిక‌మ్మా’ చిత్రంతో బాలీవుడ్‌ పరిశ్రమలోనూ హీరోయిన్‌గా ప‌రిచ‌యం కానుంది. యూట్యూబ్ ద్వారా పాప్ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం ముంబైలో ఉంటూ నటిగా పూర్తి స్థాయి కెరీర్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. ఉష ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు