నాగ శౌర్య మరియు రీతూ వర్మ జంటగా నూతన లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న కొత్త చిత్రం షూటింగ్ అన్ని జాగ్రత్తలతో ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈనెల 19వ తేదీ వరకూ షూట్ చేస్తారట. ఇక ఆ తరువాత నుంచి ఈ చిత్రంలోని సాంగ్స్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఇక నాగ శౌర్య ఇటీవల నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అశ్వథామ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ విజయం ఇచ్చిన స్పూర్తితో హీరో నాగ శౌర్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్. సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.