ఇప్పటికే మూడు చిత్రాలను అంగీకరించినా ప్రస్తుతం ‘మనం’ మరియు ‘ఆటోనగర్ సూర్య’ సినిమాల షూటింగ్ లలో బిజీగా వుంటున్న నాగ చైతన్య తదుపరి సినిమా ఏంటి అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం చైతు తదుపరి సినిమా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఈ యేడాది డిసెంబర్ లో ప్రారంభంకానుంది. హన్సిక హీరోయిన్. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు. ఈ సినిమానే కాక చైతు ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒకటి మరియు ఆకుల శివ దర్శకత్వంలో మరొక చిత్రాన్నీ ఒప్పుకున్నాడు