రాజాసాబ్ ట్రైలర్‌కు మాసివ్ రెస్పాన్స్..!

Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ హర్రర్ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఇక ఈ ట్రైలర్‌కు ఇప్పటికే 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. దీంతో ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో హైప్ పెంచింది. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తారు.

కాగా చితర యూనిట్ ప్రస్తుతం యూరప్‌లో పాటల చిత్రీకరణ కోసం లొకేషన్స్ వేటలో ఉన్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

Exit mobile version