కింగ్ నాగార్జున ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఇటీవల కుబేర, కూలీ వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశారు. అయితే, అక్కినేని అభిమానులు నాగార్జున సోలో హీరోగా ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక నాగ్ కూడా తన కెరీర్లో మైల్స్టోన్ చిత్రంగా తన 100వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాను తమిళ దర్శకుడు కార్తీక్ డైరెక్ట్ చేయనున్నాడు. అయితే, ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. నాగార్జునను కింగ్ అని అభిమానులు పిలుస్తుంటారు. ఇప్పుడు ఆయన సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ పెట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ సినిమా కథకు ఈ టైటిల్ పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందుని మేకర్స్ భావిస్తున్నారట.
మరి నిజంగానే కింగ్ నాగార్జున 100వ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ప్రొడ్యూస్ చేయనున్నారు.