‘ఒక లైలా కోసం’ అంటూ తిరుగుతున్న నాగ చైతన్య తిరిగి షూట్ లో పాల్గుంటున్నాడు. ఈ నెలలో రెండో షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా ఏ.ఎన్.ఆర్ మరణంతో తదుపరి షెడ్యూల్ ను స్వల్ప వాయిదా వేయడానికి ప్రయత్నించారు
ప్రస్తుతం నాగ చైతన్య, పూజా హెగ్ధే మధ్య కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను విజయ్ కుమార్ కొండా తెరకెక్కిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు.
త్వరలో చైతూ నటించిన ‘ఆటోనగర్ సూర్య’ విడుదలకానుంది. అంతేకాక విక్రమ్ కుమార్ ‘మనం’ కూడా మార్చ్ 31న మనముందుకు రానుంది