‘తడాఖా’ సినిమా విజయంతో మంచి ఆనందంలో వున్న నాగచైతన్య ఆతరువాత సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య తానూ ఎప్పుడో అంగీకరించిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా పూర్తిచేసే పనిలో వున్నాడు. ఇదే కాక అక్కినేని వంశంలో మూడు తరాల నటులు నటిస్తున్న ‘మనం’ సినిమాలో కూడా నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య పరశురాం దర్శకత్వంలో ‘శూన్యం’ అనే సినిమాను అంగీకరించినట్లు తెలుస్తుంది. కొన్ని మంచి సినిమాలను తన ఖాతాలో వేసుకున్న పరశురాం చివరిసారిగా ‘సారొచ్చారు’ సినిమాతో మనముందుకు వచ్చాడు.
ఈ సినిమాను ఒక అగ్ర నిర్మాత తెరకెక్కించనున్నారు. హీరోయిన్ మరియు మిగిలిన టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే మా సైట్ ద్వారా తెలియజేస్తాం