నాగ్ – నయనతార కాంబినేషన్లో ‘లవ్ స్టొరీ’ అనే చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో ప్రేమ కథలు వచ్చినప్పటికీ మా చిత్రంలోని ప్రేమ కథ చాలా విభిన్నంగా ఉంటుంది అంటున్న చిత్ర దర్శకుడు దశరద్. గతంలో నాగ్ – దశరద్ కాంబినేషన్లో ‘సంతోషం’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా అందరినీ ఆకట్టుకుంది. నాగార్జున ఈ లవ్ స్టొరీ సినిమాలో సారి కొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. ఇటీవలే హైదరాబాదులో ఈ సినిమాకి సంభందించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ నెల 21 నుండి రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. నాగార్జునకి నయనతార, మీరా చోప్రా నటిస్తున్న ఈ సినిమాని కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. రగడ తరువాత తమన్ నాగార్జున సినిమాకి సంగీతం అందించాబోతున్నాడు.