ప్రభాస్ తో అద్భుతం చేయనున్న నాగ్ అశ్విన్

ఈ మధ్య ప్రభాస్ చిత్రాలు ప్రకటనతోనే భారీ హైప్ తెచ్చుకుంటున్నాయి. మహానటితో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రకటించిన పాన్ ఇండియా మూవీపై కూడా ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెట్స్ పైకి కూడా వెళ్లకుండానే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ఈ చిత్రం గ్రాండ్ గా తెరకెక్కించడానికి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారట నిర్మాత అశ్వినీ దత్.

ఇక అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠరేపే యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కనుండగా, దాదాపు హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకోనున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ సూపర్ హీరో రోల్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తుండగా, ఆయన లుక్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ సరికొత్తగా ఉండనున్నాయట. రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పై నాగ్ అశ్విన్ వర్క్ చేస్తుండగా ప్రభాస్ తో అద్భుతం చేయనున్నాడని సమాచారం.

Exit mobile version