టాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ది మోస్ట్ ప్రెస్టీజియస్ ‘కల్కి 2898 ఎడి’ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు నాగ్ అశ్విన్ రెడీ అవుతున్నాడు.
అయితే, ఈ క్రమంలో నాగ్ అశ్విన్ ఇప్పుడు ఓ లెజెండరీ డైరెక్టర్‌తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో నాగ్ అశ్విన్ త్వరలో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో అనుదీప్ కెవి డైరెక్షన్‌లో ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
మరి ఈసారి సింగీతం శ్రీనివాస్ రావు ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో సింగీతం తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేయబోయే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


