మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రానున్న ‘నాయక్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మిగిలి ఉన్న చివరి పాటని త్వరలోనే చిత్రీకరించనున్నారు. ఈ పాటతో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది , ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక డిసెంబర్ 17న నానక్రాంగూడా రామానాయుడు స్టూడియోలో జరగనుంది.
ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి వి.వి వినాయక్ డైరెక్టర్. కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నాడు. నాయక్ సినిమాకి రిలీజ్ కంటే ముందే మంచి బిజినెస్ జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్ర నైజాం రైట్స్ ని సుమారు 11 కోట్లకి దిల్ రాజు కొనుక్కున్నారు.