మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాయక్’ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు నానక్రాంగూడాలోని రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది. ఈ వేడుక కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు రాజకీయ వేత్తలు, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించాడు. గ్లామరస్ బ్యూటీస్ కాజల్ అగర్వాల్ – అమలా పాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వి.వి వినాయక్ డైరెక్టర్. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమాని జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ ఆడియో వేడుక లైవ్ అప్డేట్స్ మరియు కవరేజ్ ప్రత్యేకంగా 123తెలుగు.కామ్ సాయంత్రం నుండి మీకందిస్తోంది, చూసి ఎంజాయ్ చేయండి.