మా రిలేషన్ కి పేరు పెట్టలేము – గౌతమి

మా రిలేషన్ కి పేరు పెట్టలేము – గౌతమి

Published on Aug 25, 2013 12:15 PM IST

Kamal-and-Gauthami
మాజీ స్టార్ హీరోయిన్ గౌతమికి ఎంతో సక్సెస్ఫుల్ కెరీర్ ఉంది. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. తాజాగా ఓ తెలుగు దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన లైఫ్ లో ఫేస్ చేసిన సమస్యల్ని, అలాగే సినిమా చాన్స్ కూడా అనుకోకుండా వచ్చిందని కానీ మొదటి సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవవసరం లేకపోయిందని చెప్పింది. తన మొదటి భర్త నుంచి దూరంగా ఉన్న గౌతమి తన కూతిరితో ఉంటోంది. అలాగే ఆమె ప్రస్తుతం కమల్ హాసన్ తో సహజీవనం సాగిస్తోంది. గౌతమికి 2005లో రొమ్ము కాన్సర్ వచ్చింది. సుమారు ఆరేళ్ళ పాటు నిర్విరామంగా తీసుకున్న చికిత్స వల్ల ఆమె కాన్సర్ ని జయించగలిగింది.

గౌతమి కమల్ గురించి మాట్లాడుతూ ‘ ప్రస్తుతం సొసైటీలో ఫ్రెండ్స్, లవర్స్, భార్య భర్త అని ఇలా చాలా రిలేషన్స్ ఉన్నాయి కానీ నాకు – కమల్ కి ఉన్న్న రిలేషన్ కి ఎలాంటి పేరు పెట్టదలుచుకోలేదు. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మంచి గౌరవం. నాకు కాన్సర్ ట్రీట్ మెంట్ జరుగుతున్నప్పుడు మెంటల్ గా, ఫిజికల్ గా కమల్ నాకిచ్చిన సపోర్ట్ నేనెప్పటికీ మర్చిపోలేనని’ తెలిపింది. సినిమాలకు దూరంగా ఉన్న గౌతమి ప్రస్తుతం ‘రంగం’ అనే టీవీ ప్రోగ్రాంలో కనిపిస్తోంది.

తాజా వార్తలు