‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి ఎంతోమందికి చిన్న సినిమాలు చెయ్యాలి అన్న స్పూర్తిని ఇచ్చాడు. కానీ మారుతి సక్సెస్ అయినంతగా వేరే ఎవరు సక్సెస్ అవ్వలేదు.
ఇటీవలే మారుతి తనకి ఇలాంటి, అలాంటి డ్రీం ప్రాజెక్ట్ లాంటివి ఏమీ లేవు కానీ అతనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చెయ్యాలన్నది తన డ్రీం అని తన మనసులో మాట చెప్పాడు. అలాగే అతను మాట్లాడుతూ ‘ఒక చిన్న సినిమాని తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్ల కెపాసిటీ పవన్ కళ్యాణ్ కి ఉంది. అది ఆయనకీ కూడా చాలా కొత్తది కచ్చితంగా ఓ రోజు నాకు ఆయన్ని డైరెక్ట్ చేసే చాన్స్ వస్తుందని ఆశిస్తున్నానని’ మారుతి అన్నాడు.